
కేథరిన్ ట్రెసా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు అమ్మడుకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
కేథరిన్ డెబ్యూ మూవీ శంకర్ ఐపీఎస్. 2010లో ఈ కన్నడ చిత్రం విడుదలైంది. ఇక తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో అరంగేట్రం చేసింది. అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకుంది.. ఇక మరోసారి బన్నీ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.
సరైనోడు మంచి విజయం సాధించింది. సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశారు. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది.. గత కళ్యాణ్ రామ్ మూవీ బింసారా లో మెరిసింది.. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా 2023 సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.. ఈ క్రమంలోనే హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది..