Leading News Portal in Telugu

Sreeleela: తమిళ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?


Sreeleela: తమిళ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభించినప్పుడు కన్నడ సినిమాల్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న శ్రీలీల.. తెలుగులోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మొదట్లో లక్షల్లోనే పారితోషికం తీసుకుంది. అయితే రీసెంట్ గా శ్రీలీలకి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. ఇటీవల బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు పోటీగా శ్రీలీల నటించి మెప్పించింది. తన నటన, డ్యాన్స్‌ తో ప్రేక్షకులను మెప్పించింది. శ్రీలీల అందం, అభినయం ముఖ్యంగా డ్యాన్స్‌ ప్రేక్షకును తెగ ఆకట్టుకుంది..

తెలుగులో ఫుల్ బిజీగా ఉంది.. ఈ మధ్య శ్రీలీల నటించిన ‘స్కంద’ చిత్రం ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ విడుదలై సూపర్ హిట్ అయింది. శ్రీలీల ప్రస్తుతం ఐదు, ఆరు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా చేస్తోంది. శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, ‘ఆదికేశవ’ సినిమాల్లోనూ నటిస్తోంది. కాగా, శ్రీలీల తమిళ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే క్లారిటి ఇవ్వనుందని సమాచారం..