Leading News Portal in Telugu

Mahesh Babu: బీడీ నుంచి బిర్యాని పాట వరకూ అన్నీ లీకులే కదా సర్… ఏంటో ఈ కర్ణుడి కష్టాలు


Mahesh Babu: బీడీ నుంచి బిర్యాని పాట వరకూ అన్నీ లీకులే కదా సర్… ఏంటో ఈ కర్ణుడి కష్టాలు

మహేష్ బాబు ఏ సమయంలో గుంటూరు కారం సినిమాని ఓకే చేసాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎన్ని వినకూడదో అన్నీ వినాల్సి వస్తోంది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవడానికి షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. మహేష్ బాబు బీడీ కాల్చేది బయటకి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అదే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి ఉంటే థియేటర్స్ టాప్ లేపే వాళ్లు. ఆ తర్వాత మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకోని ఉన్న ఫోటో లీక్ అయ్యింది. సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తే బ్లాస్ట్ చేసిన కార్స్ లీక్ అయ్యాయి. శ్రీలీలా-మహేష్ బాబు ఉన్న ఫోటో లీక్ అయ్యింది, పూజా హెగ్డే-మహేష్ బాబు షాపింగ్ మాల్ లో ఉన్న ఫోటో లీక్ అయ్యింది.

ఇటీవలే “ప్రజాబంధు… జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు శ్రీ. వైర వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు… నిజామాబాద్” అంటూ ప్రకాష్ రాజ్ పాత్రకి సంబంధించిన లీక్… ఇలా గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పుడు షూటింగ్ జరిగినా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులో గుంటూరు కారం సాంగ్ కూడా వచ్చి చేరింది. నవంబర్ 7న రిలీజ్ కావాల్సిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్… సోషల్ మీడియాలో డైరెక్ట్ గా బయటకి వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది. ఇప్పటివరకు గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన అన్నింటికన్నా ఇది అతిపెద్ద లీక్ అనే చెప్పాలి. ఈ లీకులని చిత్ర యూనిట్ ఎందుకు ఆపలేకపోతున్నారో తెలియట్లేదు కానీ లీకులు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోని గుంటూరు కారం లీకులని బయటకి రాకుండా ఆపుతారో లేదో చూడాలి.