Leading News Portal in Telugu

Ram Pothineni: నా రక్తం చూసి బోయపాటి అలా చేశాడు… షాకింగ్ ఫోటో షేర్ చేసిన రామ్


Ram Pothineni: నా రక్తం చూసి బోయపాటి అలా చేశాడు… షాకింగ్ ఫోటో షేర్ చేసిన రామ్

Ram Pothineni Reacts on Boyapati Srinu Body Double Trolling on Internet: సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్‌ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్‌లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్‌ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్‌గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్కంద ఓటీటీలో రిలీజ్ అయ్యాక క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌లో ఎడిటింగ్‌లో టీమ్‌ చేసిన పొరపాటు కారణంగా బయట పడడంతో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. వివరంగా గమనిస్తే బోయపాటిని బాడీ డబుల్ గా వాడుకోవడం అర్థం అయిపోతుంది. నిజానికి స్కంద OTT విడుదలకు అద్భుతమైన స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవడం మొదలైన కొద్దిసేపటి నుంచే మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Satyabhama: కాజల్ ‘సత్యభామ’గా వచ్చేస్తోంది!

అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం 24 గంటల పాటు రికార్డ్ వ్యూయర్‌షిప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ బాడీ డబుల్ ట్రోలింగ్స్ మీద హీరో రామ్ స్పందించారు. ఒక ఫోటో షేర్ చేసిన ఆయన 22.04.23 నాకు ఇప్పటికీ గుర్తుందిని, వేసవి రోజులలో ఇది ఒకటి. 25 రోజుల షూట్ లో 3వ రోజు ఈ ఎపిసోడ్‌ను చిత్రీకరించిన తర్వాత ఇది నా పాదం, ఈ పాదంతో సరిగ్గా నడవలేక రక్తం కారడం మొదలైన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. నా దర్శకుడు సరిగ్గా షాట్‌ని తీయాలనుకున్నాడు., అందులో ఆయన స్వయంగా పాల్గొన్నాడు. కంటెంట్‌ని ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం అనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపిక. నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తాను, ఇదంతా మీ కోసం మాత్రమే. కానీ నా కోసం ఈ ప్రత్యేకమైన షాట్ చేసినందుకు నా దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గమనిక సున్నా నిరీక్షణతో నేను వచ్చే ప్రతిపనిలో నా రక్తం & చెమట చిందించడం మాత్రం ఆపను అని ఆయన రాసుకొచ్చారు.