
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే ఉన్న అంచనాలని మారితే పెంచే పనిలో ఉన్నాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. షూటింగ్ జరుగుతుంది, హైప్ పెరుగుతుంది కానీ గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ మాత్రం బయటకి రావట్లేదు అంటూ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ సాంగ్ అప్డేట్ దీపావళికి బయటకి వస్తుంది అనుకుంటే ఏకంగా సాంగ్ యే లీక్ అయ్యి బయటకి వచ్చేసింది.
మహేష్ ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో గుంటూరు కారం నుంచి లీక్ అయిన సాంగ్ ట్రెండ్ అవుతోంది. లీక్ అవ్వడం అనేది ఏ సినిమాకైనా మంచిది కాదు కానీ ఎలా లీక్ అయ్యింది? ఎందుకు లీక్ అనే విషయాలు పక్కన పెట్టేస్తే మాత్రం… థమన్, మహేష్ ఫ్యాన్స్ కోసం సాలిడ్ మాస్ సాంగ్ ఇచ్చాడనే చెప్పాలి. గతంలో గుంటూరు కారం గ్లిమ్ప్స్ కి… “సన్న కర్ర.. సవ్వా దెబ్బ..! బొడ్డురాయి.. బేటా దెబ్బ..! రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!” అంటూ ప్రాపర్ మాస్ లిరిక్స్ తో కంపోజ్ చేసిన సాంగ్, మహేష్ ఫాన్స్ కి పూనకాలు తెస్తే… ఈసారి మాత్రం థమన్ ఏకంగా మాస్ బిర్యానీ పెట్టేసాడు. “ఎదురొచ్చే గాలి… ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ… ఎగబడి ముందరకే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా… బిర్యానీ, ఎర్ర కారం… అర కోడి, నీంబు సోడా… ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే” అంటూ సాగిన లిరిక్స్ లీక్డ్ సాంగ్ ని రిపీట్ మోడ్ లో వినేలా చేస్తున్నాయి. మరి ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.