
మాస్ మహారాజా రవితే ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఈగల్ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ చెప్పినవిధంగానే నేడు ఉదయం 10.44 గంటలకు విడుదల చేసింది. అయితే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్‌తో జనవరి 13, 2024న వెండితెరను అలంకరించబోతున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ, అను ఇమ్మాన్యుయేల్, వినయ్ రాయ్ , కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్య తారలుగా కార్తీక్ గట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఈరోజు నవంబర్ 6న ఉదయం 10:44 గంటలకు చిత్ర నిర్మాతలు లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం దావ్జబ్ద్ అందించారు.
అయితే.. రవితేజ పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో ‘ఈగల్’ చిత్రం టీజర్‌ను ఘాటుగా వార్నింగ్ ఇస్తూ ప్రారంభమైంది. “కొండలో లావను కిందకి పిలవకు… ఊరు ఉండడు… నీ ఉనికి ఉండదు…” అనే విజువల్స్ ప్రజలకు పురాణగాథగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా కథానాయకుడు చేసిన విధ్వంసాన్ని చూపిస్తుంది. చివరగా, క్లిప్ చివరిలో రవితేజ పరిచయం చేశారు. అయితే.. ‘ఈగల్’లో రవితేజ మల్టిపుల్ గెటప్‌లు, విభిన్న షేడ్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని అందిస్తున్నట్లు కనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల మధ్య సంభాషణ, నవదీప్ మాటలు రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఈగల్’ అనేది పాన్-ఇండియా ప్రాజెక్ట్ అని, ఈ చిత్రం తెలుగు సినిమాల్లో ఒక సంచలనాత్మక వెంచర్ అని వెల్లడించారు. ప్రేక్షకులు రవితేజను విభిన్నమైన గెటప్స్‌లో చూడగలరని, ఇది కథకు మరింత బలాన్ని చేకూర్చుతుందని ఆయన పేర్కొన్నాడు.