Leading News Portal in Telugu

Suriya 43 : ఆ స్టార్ హీరో రికార్డు బ్రేక్ చేసిన సూర్య మూవీ..?


Suriya 43 : ఆ స్టార్ హీరో రికార్డు బ్రేక్ చేసిన సూర్య మూవీ..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు..ఈ మధ్యే సూర్య తన 43 వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో తెగ వైరల్ అవుతుంది..సూర్య 43 మూవీని సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) నేషనల్ అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి… దీనితో సోషల్ మీడియా ఎక్స్ లో సూర్య43 అనౌన్స్‌మెంట్ వీడియో కు ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేసింది..

సూర్య 43ని అనౌన్స్ చేస్తూ అక్టోబర్ 26న సూర్య ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటికే 2.65 కోట్ల వ్యూస్ వచ్చాయి..ఈ ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ వీడియో ఇదే. ఇప్పటి వరకూ దళపతి విజయ్ పోస్ట్ చేసిన వీడియో పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ వీడియోకు 2.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను విజయ్ గతేడాది డిసెంబర్ లో పోస్ట్ చేశాడు.అయితే సూర్య 43 అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రం కేవలం రెండు వారాల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం . ఈ సినిమాలో సూర్యతోపాటు దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ వర్మ కూడా నటిస్తుండటం విశేషం. ఈ ముగ్గురూ సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే లియో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దళపతి విజయ్.. తన తరువాత మూవీ దళపతి 68 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..