
Mangalavaaram Censor Review: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్ – అజయ్ ఘోష్ తదితరులు నటించిన మంగళవారం సినిమా ఈ వారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. నవంబర్ 17 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో మంగళవారం సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు ఈ మేరకు ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్ ఇప్పటికే పూర్తి కాగా A సర్టిఫికేట్‌తో సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక సినిమా రన్‌టైమ్ 145:42 నిమిషాలు అంటే (2 గంటల 25 నిమిషాలు)గా ఉండనుంది.
Sabarimala: నవంబర్ 17నుంచి శబరిమల దర్శనం.. తెరుచుకోనున్న ఆలయం
ఈ మంగళవారం సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్ అని, ఊహించని మలుపులతో థియేటర్‌లలో ప్రతి ఒక్కరినీ స్టన్ చేయగలదని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. మంగళవారం సినిమా నిజానికి రిలీజ్ కు ముందే భారీ సంచలనం సృష్టించింది. ఈ సినిమా 13 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ చేసింది, బాక్సాఫీస్ ఓపెనింగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయని అంచనాలు ఉన్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పెద్ద డీల్ తో క్లోజ్ అయిందని అంటున్నారు. ఇక సెన్సార్ రివ్యూ కూడా చాలా బాగుందని, ఇండస్ట్రీ నుండి సినిమా రిపోర్ట్ చాలా పాజిటివ్ గా ఉందని అంటున్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చిందని చెబుతూ ఉండడమే కాక ఒక బోల్డ్ అటెంప్ట్ అని కూడా అంటున్నారు.