Leading News Portal in Telugu

Naga Chaitanya: ‘దూత’ వచ్చే డేట్ లాక్ అయ్యింది…



Naga Chaitanya

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య కెరీర్లోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీగా గీత ఆర్ట్స్ బ్యానర్ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు నాగ చైతన్య. గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ధూత అనే వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేశాడు. అక్కినేని హీరోలకు ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవడంతో… డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫైనల్‌గా ధూత రిలీజ్ డేట్ లాక్ చేశారు. డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ధూత’ డిజటల్ స్ట్రీమింగ్‌కు రానున్నట్టుగా పోస్టర్‌తో కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య ఇంటెన్స్ లుక్ బాగుంది. ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్ సాగర్ పాత్రలో కనిపించనున్నాడు. చై చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కావడంతో… అక్కినేని అభిమానులు ఆసక్తిరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్‌లుగా రానుంది ధూత సిరీస్‌. ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీ రోల్ ప్లే చేశారు. సినిమాలతో ఫ్లాప్ అందుకున్న చైతూ… ఈ వెబ్ సిరీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ధూత ఎలా ఉంటుందో చూడాలి.