
Delhi Police on Rashmika Deep Fake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ కేసులో ఖాకీలు కీలక పురోగతి సాధించారు. మొట్టి మొదటి సారిగా ఈ వీడియో ఏ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిందో పోలీసులు గుర్తించి, రష్మిక ఫేక్ వీడియో అప్ లోడ్ కు సంబంధించిన వివరాలు అందించాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు పోలీసులు లేఖ రాశారు. అంతేకాదు, ఈ వీడియో షేర్ చేసిన వారి వివరాలు కూడా అందించాలని కోరడంతో దానికి అంగీకరించిన ఫేస్ బుక్ యాజమాన్యం, తాజాగా ఈ వీడియోను తొలిసారి షేర్ చేసిన వారి వివరాలను పోలీసులకు అందించినట్లు చెబుతున్నారు.
Abdul Razzaq: ఐశ్వర్య రాయ్ గురించి డర్టీ కామెంట్స్.. పాక్ మాజీ క్రికెటర్ క్షమాపణ
ఈ కేసులో 19 ఏళ్ళ బీహార్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ముందుగా అతని అకౌంట్ నుంచి రష్మిక డీప్ ఫేక్ వీడియో తొలుత నెట్టింట్లోకి షేర్ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ వీడియోను చాలా మంది షేర్ చేసినట్లు భావిస్తున్నారు. ఇక సదరు యువకుడి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేయగా తాను ఈ వీడియోను మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ నుంచి డౌన్ లోడ్ చేసి ఫేస్ బుక్ లో షేర్ చేసినట్టు ఆ యువకుడు ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కేవలం విచారించామని పోలీసులు తెలిపారు. రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే ఆమ్ త్వరలో రణబీర్ తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అల్లు అర్జున్ తో కలిసి అటు ‘పుష్ప2’లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా వీటితో పాటు మరో 4 సినిమాల్లోనూ నటిస్తోంది.