Leading News Portal in Telugu

Alia Bhatt: రణబీర్ టాక్సిక్.. అలియా ఏమన్నదంటే ..?



Ranbir

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా రణబీర్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తనదైన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి.. పెళ్లాడాడు. వీరి పెళ్లి కూడా అంత సులువుగా జరగలేదు. అలియా కన్నా ముందు ఎన్నో ప్రేమాయణాలను నడిపాడు. ఏది కూడా సక్సెస్ కాలేదు. అందుకు కారణం రణబీర్ చాలా టాక్సిక్ అని, అతనితో ఉండడం చాలా కష్టమని బాలీవుడ్ లో చాలా రూమర్స్ ఉన్నాయి. ఇక అలియా.. రణబీర్ ప్రేమలో మునిగితేలింది. పెళ్ళికి ముందే అలియా ప్రెగ్నెంట్ అని బాలీవుడ్ లో టాక్ ఉంది. ఇక అలియా .. రణబీర్ ను ఎంత ప్రేమిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా తన ప్రేమను ఎంతో వైవిధ్యంగా చూపిస్తుంది.

Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?

నేషనల్ అవార్డు అందుకోవడానికి అలియా.. తన పెళ్లి చీర కట్టుకొని కనిపించింది. ఎన్నో డిజైనర్ డ్రెస్ లు,చీరలు ధరించవచ్చు కానీ, ఆ పెళ్లి చీరనే ఎందుకు ధరించారు అని అలియాను అడగ్గా .. నా జీవితంలో ఈ స్పెషల్ రోజున నాకు ఎంతో స్పెషల్ అయిన పెళ్లి చీర కట్టుకోవడం ఇంకా ఆనందంగా ఉంది.. అని చెప్పుకొచ్చి రణబీర్ పై తన ప్రేమను చూపించింది. ఇక రణబీర్ టాక్సిక్ అనే రూమర్స్ పై అలియా స్పందించింది. ఇటీవల ఒక టాక్ షో లో అలియా మాట్లాడుతూ.. ” రణబీర్ టాక్సిక్ అని పిలవడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి అతను దానికి పూర్తి వ్యతిరేకం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై అభిమానులు.. భర్తపై ఒక్క మాట కూడా పడనివ్వడం లేదే అంటూ చెప్పుకొస్తున్నారు.