Leading News Portal in Telugu

Mangalavaram: పెయిడ్ ప్రీమియర్స్ రివ్యూ.. ఆర్ఎక్స్ 100 ను మించి ..?



Ajay

Mangalavaram: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఆపేశాడు. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి.. ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. అంతేకాకుండా.. టాలీవుడ్ కు పాయల్ రాజ్ పుత్ లాంటి హాట్ బ్యూటీని పరిచయం చేశాడు. కార్తికేయ లాంటి నటుడుకు హీరో స్టార్ డమ్ ను అందించాడు. ఇక మొదటి సినిమానే ఈ రేంజ్ లో తీసాడు అంటే.. తరువాత సినిమాలు అంతకుమించి ఉంటాయి అని అభిమానులు అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి అనే చందాన అజయ్ నెక్స్ట్ సినిమా మహా సముద్రం భారీ డిజాస్టర్ ను అందుకుంది. మొదటి సినిమాకు ఎంత అయితే పొగిడారో.. రెండో సినిమాకు అంతకన్నా ఎక్కువ విమర్శించారు.

Singer Sunitha: పర్సనల్స్ రికార్డింగ్ స్టూడియోలో ఎందుకు మాట్లాడతారు.. సునీత ఎమోషనల్

ఇక ఈ సినిమా కొట్టిన దెబ్బతో అజయ్ భూపతి కోలుకోలేకపోయాడు. ఎలాగైనా తన కమ్ బ్యాక్ ఆర్ఎక్స్ 100 మించి ఉండాలి అని గ్యాప్ తీసుకొని మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రేపు రిలీజ్ కు రెడీ అవుతుంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో సినిమాపై నమ్మకం ఉండి .. హిట్ కొడతాం అని కాన్ఫిడెన్స్ ఉన్నవారే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక అజయ్ మొదటి నుంచి కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అందుకే పెయిడ్ ప్రీమియర్స్ తో అభిమానులను ఆకట్టుకోవడానికి ప్లాన్ వేశాడు. ఇక ఈ ఐడియా బాగా వర్క్ అవుట్ అయ్యినట్లు తెలుస్తోంది. సినిమా అభిమానులకు నచ్చిందని టాక్ నడుస్తోంది.

Dhruva Natchathiram : లిరికల్ సాంగ్, న్యూ పోస్టర్ తో సినిమా పై హైప్ పెంచుతున్న మేకర్స్..

మొదటి భాగం అంతా డీసెంట్ గా ఉన్నా.. క్లైమాక్స్ 30 నిమిషాలు పాత అజయ్ భూపతిని చూపించినట్లు పెయిడ్ ప్రీమియర్స్ చూసినవారు చెప్తున్నారు. ఇక పాయల్ అయితే పాత్రలో జీవించేసిందని అంటున్నారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో ఆకట్టుకున్న పాయల్.. ఈ సినిమాలో నటనతో బెంబేలెత్తించిందని టాక్. ఇక ఆర్ఎక్స్ 100 ను మించి కాకపోయినా.. కొత్త కాన్సెప్ట్ తో.. టేకింగ్ తో అదరగొట్టేశాడు అంట. ఇక సినిమాకు హైలైట్ అంటే.. బీజీఎమ్ అని చెప్పుకొస్తున్నారు. కాంతార సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అంజనీష్ లోక్ నాధ్ బీజీఎమ్ తో పిచ్చెక్కించాడట. ఓవర్ ఆల్ గా మంగళవారం సినిమా.. పాజిటివ్ టాక్ ను అందుకుంది అని అంటున్నారు. మరి ఫ్యాన్స్ రివ్యూస్ ఎలా ఉంటాయో రేపు చూడాలి.