
DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్.. ఇలా ఒకటి అని కాకుండా అభిమానులు దేన్నీ అయితే కోరుకుంటున్నారో.. అన్నింటినీ వారికి అందించడానికి ట్రై చేస్తోంది. అందులోనూ స్టార్ హీరోస్ ను హోస్టులుగా మారుస్తూ.. ఇంప్రెషన్ కొట్టేస్తుంది. ఇప్పటికే విశ్వక్ సేన్.. ఫ్యామిలీ ధమాకా అనే షో హోస్ట్ చేస్తున్నాడు. ఇక బాలయ్య.. అన్ స్టాపబుల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక వీరితో పాటు మరో కుర్ర హీరో కూడా హోస్ట్ గా మారాడు. అతడే నవదీప్. ఈ మధ్యనే డగ్అవుట్ అనే షో కు నవదీప్ హోస్ట్ చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ తో పాటు సెలబ్రిటీల ఫన్ ముచ్చట్లు ఈ షోలో చూడబోతున్నారు ప్రేక్షకులు.
Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?
ఇక ఈ షోకు సంబంధించిన మొదటి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు. మొదటి ఎపిసోడ్ లో పాయల్ రాజ్ పుత్, డర్టీ హరి ఫేమ్ శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. వీరు మంగళవారం ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పాయల్ ను అయితే నవదీప్ ఆడేసుకున్నాడు. వచ్చిరానీ తెలుగులో పాయల్.. నవదీప్ కు, శ్రవణ్ కు చుక్కలు చూపించింది. ఇక ఇందులో పాయల్ ను నవదీప్ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఆటపట్టించాడు. ” మంచం మీద, క్రికెట్ లో.. రెండు ప్లేస్ ల్లో అనగలిగే మూడు విషయాలు ఏంటి” అని అడగ్గానే అస్సలు తడబడకుండా పాయల్.. వెల్ ప్లేయిడ్ (బాగా ఆడారు) అని చెప్పుకొచ్చింది. దీంతో నవదీప్, శ్రవణ్ షాక్ అయ్యారు. ఇలా ప్రోమో అంతా నవదీప్, పాయల్ నవ్వులు పూయించారు. ఇక ఈ ఎపిసోడ్.. నవంబర్ 18 న స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.