Leading News Portal in Telugu

Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?


Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. డిసెంబర్ 1 న ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు.. రెండు రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అధికారికంగా వెల్లడిస్తున్నారు.

Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్

నిన్నటికి నిన్న.. ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌ను అనౌన్స్‌ చేశారు. ఉత్తరాంధ్రలో శ్రీ సిరి సాయి సినిమాస్, తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు రీజియన్లలో కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్, నెల్లూరులోని శ్రీ వెంగబాంబ సినిమాస్, సీడెడ్‌లోని శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ సలార్‌ మూవీని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవన్నీ సరే కానీ, నైజాం ఎవరికీ వెళ్ళింది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇక ఎట్టకేలకు దానికి కూడా సమాధానం దొరికింది. సలార్ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ తెలిపారు. దాదాపు రూ. 90 కోట్లు భారీ మొత్తంలో చెల్లించి నైజాం హక్కులను పొందినట్లు సమాచారం. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాను నైజాంలో రిలీజ్ చేయడమంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఆ ఛాన్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ పట్టేశారు. ఇప్పటికే నేషనల్ అవార్డు ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది మైత్రీ. పుష్ప సినిమాను మైత్రీనే నిర్మించింది. ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉంది. మరి సలార్ తో మైత్రీ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.