Leading News Portal in Telugu

Mangalavaram : మంగళవారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టిందిగా..



Whatsapp Image 2023 11 18 At 11.20.50 Pm

ఆర్ఎక్స్ 100 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ మంగళవారం . ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ తెలుగులో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది.. కానీ తాను చేసిన ఏ సినిమా కూడా భారీ విజయాల్ని సాధించలేకపోయాయి.అయితే ఈ అమ్మడు నటించిన తాజా మూవీ మంగళవారంతో అజయ్ భూపతి… పాయల్‌కు అదిరిపోయే హిట్టిచ్చాడు. మంగళవారం సినిమాలో చైతన్య కృష్ణ, శ్రీతేజ్‌ మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా నవంబర్ 17 న విడుదల అయి అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది. దీనితో మంగళవారం మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. తొలిరోజే దాదాపు నాలుగున్నర కోట్ల వరకు గ్రాస్‌ను అలాగే రెండు కోట్ల ఇరవై లక్షలకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది.పెయిడ్ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ రావడంతో మంగళవారం ఫస్ట్ డే అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. అత్యధికంగా నైజాం ఏరియాలో ఈ సినిమా కోటి వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

శనివారం రోజు కూడా దాదాపు రెండు కోట్ల వరకు ఈ మూవీ షేర్‌కలెక్షన్స్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు పదమూడు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.తొలిరోజే దాదాపు రెండున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రావడంతో ఫస్ట్ వీక్‌లోనే మంగళవారం సినిమా లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల వారు చెబుతోన్నారు. సినిమాలో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ పర్ఫామెన్స్ కు యూత్ ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే బోల్డ్ పాయింట్‌ను ఈ సినిమాలో అజయ్ భూపతి టచ్ చేశారు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.. ప్రతి సీన్ కూడా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చింది.. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి…