Leading News Portal in Telugu

Ranbir Kapoor : రణబీర్ కపూర్ ధరించిన వాచ్ ధర వింటే మైండ్ బ్లాకే.. వామ్మో అన్ని లక్షలా?



Ranabir

సినీ హీరో, హీరోయిన్లు వాడే వస్తువుల పై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు… వాళ్లు వాడే వస్తువులు ఏ బ్రాండ్ కు చెందినవి.. ఎక్కడ కొన్నారు.. ఎంత పెట్టి కొన్నారు అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ ఫ్యాషన్ ఐకాన్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. సౌత్ లో కూడా రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది..

ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్.. ఇటీవల యానిమల్ ఈవెంట్లో పాల్గొన్న రణబీర్ తన స్టైలీష్ లుక్‏లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అతను ధరించిన ‘పాటెక్ ఫిలిప్’ వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ పాటేక్ ఫిలిప్ బ్రాండ్ కు చెందిన ఆక్వానాట్ సెల్ఫ్-వైండింగ్ వాచ్‌..ఆ వాచ్ ధర అంత ఖరీదు అన్నమాట.. ఆ వాచ్ ధర అక్షరాల రూ. 72.6 లక్షలు అని సమాచారం. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇండియన్ హారాలజీ ప్రకారం రణబీర్.. పటెక్ ఫిలిప్ 5168G-ఆక్వానాట్ వాచ్‌ని పెట్టుకున్నారు..

అయితే ఇప్పుడు వాచ్ ధర విని నెటిజన్లకు నోట మాట రావడం లేదు..వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్ వాచ్, ప్రకాశించే పూతతో పాటు బంగారు నంబర్స్ కలిగి ఉంటుంది. ఇది బ్లూ ఎంబోస్డ్ డయల్, ట్రాపికల్ కాంపోజిట్ స్ట్రాప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వాచ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.. ఇక ఇతని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కాబోతుంది..