
Tiger Nageshwar Rao Trending in Amazon prime Video: మాస్ మహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోని ఈ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మంచి స్పందన తెచ్చుకున్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ వెనక్కినట్టు సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని వెల్లడించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని వంశీకృష్ణ డైరెక్ట్ చేశాడు.
Bigg Boss 7 Telugu: బిగ్బాస్ స్టేజ్ పై హీరో శ్రీకాంత్ సందడి.. అమర్ ను సపోర్ట్ చేస్తూ..
దసరా సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్ లో నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఇతర సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి ఈ సినిమా టాప్ వన్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా తర్వాత రవితేజ ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అంటే ఫ్యాన్ ఇండియాలో రిలీజ్ కానుంది.