Leading News Portal in Telugu

Vyooham: వ్యూహం సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి..



Whatsapp Image 2023 11 19 At 4.41.41 Pm

డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధప్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత మొదలుకొని జగన్ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర అలాగే ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలు ఈ సినిమా లో చూపించనున్నారు.దీంతో ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తి పెంచేసింది. ఇదిలా ఉంటే వ్యూహం సినిమా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది..  ఆర్జీవి ఈ సినిమాను వ్యూహం, శపధం అనే రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.ఇక అంతకు ముందు ప్రకటించినట్లు వ్యూహం సినిమాను షూటింగ్ పూర్తి చేసి నవంబర్‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది..కానీ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాల నేపథ్యంలో ఈ సినిమా ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

వ్యూహం సినిమా లో తమను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకుడు లోకేష్‌ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రివైజింగ్ కమిటీ చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. అయితే ఈ సినిమా కు సెన్సార్‌ బోర్డ్ అనుమతి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్న తరుణంలో దర్శకుడు రామ్‌గోపాలవ్‌ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని పెంచేసింది. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు.వ్యూహం నేరుగా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిని ఖండిస్తూ వర్మ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే వ్యూహం సినిమా థియేటర్లకు రానుందని వర్మ క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే సెన్సార్‌ బోర్డ్‌ వ్యూహం సినిమా విడుదలకు నిరాకరణ తెలిపిన విషయంపై వర్మం గతంలో స్పందిస్తూ.. ‘ఉడ్తా పంజాబ్ మరియు పద్మావత్‌’ వంటి హిందీ సినిమా లకు కోర్టు ద్వారా రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లే తాము కూడా తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తామని తెలియజేశారు.

https://twitter.com/RGVzoomin/status/1726110775381819697?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726110775381819697%7Ctwgr%5E95d729c1bcbd1727b926fdb79e2eb463bd2674f5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F