మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీస్ ఆ ఫీసర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్న లుక్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది. బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న భీమా సినిమా లో గోపీచంద్ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇదిలా ఉంటే గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తన 32 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే… ప్రస్తుతం గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సినిమా కోసం గోపీచంద్ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.. రణం, లక్ష్యం మరియు యజ్ఞం టైటిల్స్ లాగే చివరలో ‘M’ వచ్చేలా తాజాగా చిత్రానికి పేరును కూడా ఫైనల్ చేశారని తెలుస్తుంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే గోపీచంద్ సెంటిమెంట్‌తో వస్తోన్న తాజా టైటిల్‌తో మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అంటున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. అలాగే చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండెపూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.