
Vaishnav Tej: మెగాస్టార్ అనే వృక్షాన్ని పట్టుకొని ఎన్నో కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలు నెమ్మదిగా చెట్టుగా మారుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ వృక్షాన్ని పట్టుకొని వచ్చిన చిన్న కొమ్మ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి చెల్లెలి కొడుకుగా మొదట సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. అన్నకు తగ్గ తమ్ముడిగా.. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమానే నేషనల్ అవార్డు అందుకొని వైష్ణవ్ కు మంచి పునాది వేసింది. అయితే ఆ పునాదిని నిలబెట్టుకోవడం కోసం మెగా మేనల్లుడు చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే వైష్ణవ్ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇక ప్రస్తుతం అతని ఆశలన్నీ ఆదికేశవ మీదనే ఉన్నాయి. వైష్ణవ్, శ్రీలీల జంటగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24 న రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన వైష్ణవ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నాడు.
Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నిర్దోషి.. తేల్చేసిన పోలీసులు.. ?
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరుతో తనకున్న బాండింగ్ గురించి, మెగా కజిన్స్ గురించి వైష్ణవ్ చెప్పుకొచ్చాడు. ” మెగా కుటుంబంలో షో స్టీలర్ అంటే చరణ్ అన్ననే. ఆయన వేసుకొనే డ్రెస్సింగ్ కానీ, నడిచే విధానం కానీ ఎంతో హుందాగా ఉంటాయి” అని చెప్పుకొచ్చాడు. ఇక గుండుతో ఉన్న ఫోటోను చూపించి .. ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేస్తారా విలన్ గా అన్న ప్రశ్నకు .. తప్పకుండా.. విలన్ గా చేయడానికి తానూ రెడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన తల మీద చిరు అని అక్షరాలు రాసి ఉన్న ఫోటోను చూపించినప్పుడు.. ఆ పని తానూ ఎందుకు రాసుకున్నాడో తెలిపాడు. ” పెద్ద మామయ్య బర్త్ డే. అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు . అన్నయ్య కత్తి ఇచ్చాడు. నేనేం ఇవ్వగలుగుతాను.. నా ప్రాణం తప్ప. అప్పుడు నేను ఆలోచించాను. ఆ సమయంలోనే నేను ఒక ఫుట్ బాల్ మ్యాచ్ చూసాను. అందులో ఫుట్ బాల్ లా హెయిర్ కట్ చేయించడం చూసాను. అలా చేయిద్దామని ఫిక్స్ అయ్యాను. చిరంజీవి, పెద్ద మామ ఇలా స్టైల్ చేయిద్దామనుకున్నా.. కానీ, చిరు అనేది నా తలకు సరిపోతుంది అని అది రాసుకున్నా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.