
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, శ్రీకాంత్, ఇతర కాస్ట్ పైన సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. నైట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే దేవర ఒక గ్రాండ్ సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే దాదాపు 2000 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు.
ఎన్టీఆర్ ఎలాంటి డాన్సర్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ డాన్సర్ కి అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తగిలితే థియేటర్స్ లో ఫైర్ వర్క్స్ జరిగినట్లే. ఇప్పుడు ఈ ఇద్దరికీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా కలిసాడు. అనిరుధ్ కంపోజ్ చేసిన సూపర్ ట్యూన్ కి స్టెప్స్ కంపోజ్ చేయనున్నాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఎన్టీఆర్-ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాంబినేషన్ లో సూపర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఆస్కార్ మాస్టర్ ఎన్టీఆర్ తో స్టెప్స్ వేయించిన ప్రతిసారీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు దేవర ఆ సాంగ్స్ ని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో కూర్చోవడం గ్యారెంటీ. కెరీర్ బెస్ట్ సాంగ్ ని అనిరుధ్ కంపోజ్ చేసాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదే నిజమైతే దేవర సాంగ్… పాన్ ఇండియా థియేటర్స్ కి షేక్ చేయడం గ్యారెంటీ. ఇదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రాణం పోసిన కొమురం భీముడో పాట 100 మిలియన్ వ్యూస్ టచ్ అవ్వడంతో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.