Leading News Portal in Telugu

Kalasa Teaser: వాయమ్మో బిగ్‌బాస్‌ భానుశ్రీ ఏంట్రా ఇలా భయపెడుతోంది?



Kalasa Teaser

Kalasa Movie Teaser Released: బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ మూవీ రిలీజ్ కి సిద్ధం అయింది. కొండ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్‌ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా టీజర్‌ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కలశ’ టీజర్‌ను భీమ్లా నాయక్‌ డైరెక్టర్‌ సాగర్‌ చంద్ర రిలీజ్ చేయగా బ్యానర్‌ లోగోను డైరెక్టర్ వి.ఎన్‌. ఆదిత్య, టైటిల్‌ లోగోని డైరెక్టర్ యాట సత్యన్నారాయణ, మోషన్‌పోస్టర్‌ను డైరెక్టర్ వీరశంకర్‌ లాంచ్‌ చేశారు. అనంతరం సాంగ్‌ను వి.ఎన్‌. ఆదిత్య, వీరశంకర్‌, సాగర్‌చంద్ర, యాట సత్యన్నారాయణ ఉమ్మడిగా విడుదల లాంచ్‌ చేశారు.

Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్

ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో ఆత్మలతో కూడిన సినిమాలాగా అనిపిస్తోంది. భానుశ్రీ, సోనాక్షి వర్మ వణికించేలా కనిపిస్తున్నారు. ఈ టీజర్ ఒక్క సారిగా సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉంది. టీజర్ రిలీజ్ చేసిన అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ ‘కలశ’ అనే టైటిల్‌ ఈ సినిమాలోని క్యారెక్టర్‌, కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ క్యారెక్టర్‌ కూడా అంతే పవిత్రంగా ఉంటుందన్నారు. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగిందన్న ఆయన బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్‌ చేస్తూ రాసుకున్న సినిమా ఇదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ ఎక్కడా అశ్లీలత లేకుండా చేసిన ఈ సినిమా చూసి సెన్సార్‌ కూడా కట్స్‌ లేకుండా సర్టిఫికెట్‌ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నానన్నారు.