Leading News Portal in Telugu

Devil : ఆకట్టుకుంటున్న థిస్ ఇజ్ లేడీ రోసి సాంగ్ ప్రోమో.



Whatsapp Image 2023 11 24 At 10.30.19 Pm

నందమూరి కల్యాణ్‌రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు.బింబిసారా కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్..ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్ మరియు ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది.ఇటీవలే మాయే చేసి సాంగ్‌ ను మేకర్స్ విడుదల చేయగా మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్‌ సింగిల్ అప్‌డేట్ అందించారు.

ఈ మూవీ నుంచి ఎల్నాజ్ నొరౌజీ చేసిన సెకండ్ సింగిల్ ‘థిస్ ఇజ్ లేడీ రోసి’ ప్రోమోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ”డాన్స్ డాన్స్ మళ్లీ కొత్తగా.. డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా.. డాన్స్ డాన్స్ థిస్ ఇజ్ లేడీ రోసి అంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా సాగింది ఈ పాట. ఇక ఈ పాటకు శ్రీ హర్ష ఈమని లిరిక్స్ అందించగా రాజా కుమారి ఎంతో చక్కగా ఆలపించారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.అయితే పూర్తి పాటను నవంబర్ 27న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కల్యాణ్ రామ్ డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ లుక్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.