Leading News Portal in Telugu

L2E Empuraan: లూసిఫర్ సీక్వెల్ కోసం పాక్ భామ


L2E Empuraan: లూసిఫర్ సీక్వెల్ కోసం పాక్ భామ

Pakistani actress Mahira Khan signed for Lucifer sequel L2E Empuraan: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ ఫీట్ కొట్టిన ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ కూడా చేశారు. అయితే ఈ లూస్ ఫర్ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నామని కొద్ది రోజులు క్రితం అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ లూసిఫర్ సినిమాలో ఒక పాకిస్తానీ నటి కూడా భాగమైనట్లుగా తెలుస్తోంది. పాకిస్తానీ నటి మహీరళా ఖాన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఆమె షారుక్ ఖాన్ హీరోగా నటించిన రఈస్ అనే సినిమా ద్వారా ఇండియన్ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తర్వాత ఉరి ఎటాక్ జరిగిన నేపథ్యంలో పాకిస్తానీ నటీనటులు, గాయనీ గాయకులను ఇండియాలో ప్రదర్శనలు ఇవ్వడానికి సినిమాలు చేయడానికి వీలు లేదంటూ నిషేధం విధించారు.

Allu Arjun: బోయపాటికి బన్నీ ‘షరతులు వర్తిస్తాయి’!

తర్వాత కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఆమెను ఈ మలయాళ పాన్ ఇండియా సినిమాలోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్2ఇ ఎంపురాన్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం మలయాళంలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పలు తెలుగు కన్నడ తమిళ హిందీ నటీనటులను కూడా సినిమాలో భాగం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ – ఆశీర్వాద్ సినిమాస్ ఎల్2ఇ ఎంపురాన్‌ సినిమాని నిర్మిస్తున్నాయి. మురళీ గోపీ రచయిత కాగా దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు. సుజిత్ వాసుదేవ్ ఫోటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్న ఈ సినిమాలో మొదటి భాగంలో కనిపించిన మంజు వారియర్, టోవినో థామస్ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక నటులు కూడా కనిపించనున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.