Leading News Portal in Telugu

Allu Arjun: బోయపాటికి బన్నీ ‘షరతులు వర్తిస్తాయి’!


Allu Arjun: బోయపాటికి బన్నీ ‘షరతులు వర్తిస్తాయి’!

Allu Arjun Conditions to Boyapati Srinu for Next Movie: అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ హీరోగా స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదే విధంగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఏకి పారేశారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 అనే సినిమా చేస్తానని ప్రకటించాడు కానీ అంతకన్నా ముందే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కలిసి గతంలో సరైనోడు అనే సినిమా చేశారు. ఈ సినిమా బాగానే హిట్ అయింది ఈ నేపద్యంలో అల్లు అర్జున్ బోయపాటి శ్రీను మీద ఉన్న నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు కానీ ఆయన ఒక చిన్న కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

Rashmika Mandanna: విజయ్ కోసం సీక్రెట్ గా అక్కడికెళ్లిన రష్మిక మందన్న?

పుష్ప 2 సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే ముందు దాదాపు 7 నుంచి 8 నెలల వరకు గ్యాప్ దొరుకుతుందట. ఆ గ్యాప్ లో బోయపాటి సినిమా చేయాలని ఇవన్నీ భావిస్తున్నాడు. అయితే స్కంద సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ బోయపాటికి కొన్ని షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే తాను బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేస్తానని గవర్నమెంట్ స్క్రిప్ట్ ఉన్నా సరే ఆ స్క్రిప్ట్ తనకు నచ్చితేనే సినిమా పట్టాలెక్కుతుందని అలాగే లాజికల్ సీన్స్ మాత్రమే సినిమాలో ఉండేలా చూసుకోవాలని కూడా షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బన్నీ షరతులు మేరకు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో పడినట్లుగా చెబుతున్నారు. బన్నీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ ఇమేజ్ ని దేశవ్యాప్తంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఇమేజ్ ఏ మాత్రం చెడిపోకుండా ఉండేందుకు ఆయన ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదని బన్నీ అభిమానులు భావిస్తున్నారు.