
ఒక హీరో రేంజ్ ఏంటో చెప్పాలి అంటే కలెక్షన్స్ ని కౌంట్ చేయాలి కానీ కొంతమంది హీరోల సినిమాలు తెరకెక్కే బడ్జట్ లెక్కలు చూస్తే చాలు ఆ హీరో రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ జనరేషన్ ని పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కాయి. త్వరలో రానున్న సలార్ రెండు పార్ట్లు, కల్కి, స్పిరిట్, మారుతి ప్రాజెక్ట్ ల బడ్జెట్ లు కలిపితే… దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉంటాయి అంటే కేవలం ప్రభాస్ పైన రెండు వేల కోట్ల ఖర్చు పెడుతున్నారన్నమాట. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోస్ లో ప్రభాస్ తర్వాత ఇదే రేంజ్ లైనప్ ని మైంటైన్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగులోనే కాదు మొత్తం సౌత్ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కే సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్.
కొమురం భీముడిగా అద్భుతంగా నటించి పాన్ వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అయిన ఎన్టీఆర్… ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జట్ తో దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దేవర షూటింగ్ కంప్లీట్ అవగానే… బాలీవుడ్లో వార్ 2 చేస్తున్నాడు తారక్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతుంది. మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్… మాసియెస్ట్ ప్రాజెక్ట్ NTR31 సినిమా కూడా 300 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ అయ్యే సినిమానే. ప్రశాంత్ నీల్-నటైర్ ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం బడ్జట్ ఉండడంలో తప్పు లేదు. సో మొత్తంగా దేవర, వార్ 2, NTR 31… సినిమాల బడ్జెట్ చూసుకుంటే… దాదాపు 1200 కోట్ల వరకు ఉంది. సినిమాల బడ్జెట్ లే 1200 కోట్లంటే.. బిజినెస్ డబుల్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ సినిమాలతో యంగ్ టైగర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.