Leading News Portal in Telugu

Tiger 3: మరో మూడు రోజుల్లో దుకాణం మూత పడుతుంది…


Tiger 3: మరో మూడు రోజుల్లో దుకాణం మూత పడుతుంది…

డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్ మూవీ వచ్చే లోపు వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ని తమ బ్యాగ్ లో వేసుకోవాలని చూస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు.

టైగర్ 3 సినిమా నవంబర్ 12న రిలీజ్ అయ్యింది. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా ఓపెనింగ్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా టైగర్ 3 సినిమా ఇప్పటివరకూ 430 కోట్లకి పైగా రాబట్టింది. ఆ రేంజ్ కలెక్షన్స్ వేరే ఏ సినిమాకి వచ్చినా అది సూపర్ హిట్ కింద లెక్కేసే వాళ్లు కానీ సల్మాన్ సినిమా పైగా షారుఖ్ క్యామియో కూడా ఉన్న సినిమా విషయంలో మాత్రం ఆ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. డిసెంబర్ 1తో టైగర్ 3 థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ లోపు 450 కోట్ల మార్క్ అయినా అందుకోవాలని టైగర్ 3 సినిమా టికెట్ రేట్స్ ని తగ్గించారు యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియాలోని అన్ని మల్టీప్లెక్స్ లో టైగర్ 3 సినిమాకి నవంబర్ 30 వరకు 150 రూపాయల టికెట్ రేట్ ని ఫిక్స్ చేసారు. మరి ఈ రేట్ తగ్గించే విషయం టైగర్ 3 ఫైనల్ కలెక్షన్స్ ని ఎంతవరకు పెంచుతాయి అనేది చూడాలి.