Leading News Portal in Telugu

Hai Nanna: ఓడియమ్మ.. విక్రమ్ కొడుకుతోనే ఆ పని చేయించారా.. ?


Hai Nanna: ఓడియమ్మ.. విక్రమ్ కొడుకుతోనే ఆ పని చేయించారా.. ?

Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఇంకోపక్క నాని.. పాన్ ఇండియా లెవల్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. ఇక సినిమాలో హైలైట్ గా మారింది.. శృతి హాసన్. ఒక స్పెషల్ సాంగ్ కోసం శృతి, నానితో జత కట్టింది. ఇక ఓడియమ్మ హీట్ అంటూ సాగే ఈ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

Extra – Ordinary Man Trailer: నితిన్ ఈసారి కొట్టేలానే ఉన్నాడమ్మా .. మైసమ్మ

బీచ్ ఒడ్డున పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ సెట్ లో నాని, శృతి లుక్ అదిరిపోయింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్, శృతి హాసన్ ఆలపించడం విశేషం. ఇక ఈ సాంగ్ గురించి సినిమాకు పనిచేసినవారితో పాటు నాని, శృతి కూడా చెప్పుకొచ్చారు. ఇది పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ అని, అందరికి నచ్చుతుందని నాని చెప్పుకొచ్చాడు. ఈ సాంగ్ ను నవంబర్ 28 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.