Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది. అమ్మడి అందానికి అప్పటి కుర్రకారు గుండెల్లో గుళ్లు కూడా కట్టేశారు. ఆ సినిమా విజయం తరువాత.. తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ, అమీషా కు మాత్రం ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. దీంతో.. అమీషా.. బాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది. ఇక సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన అమీషా 47 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది.
Nani: పిల్లనిచ్చింది కాదు కానీ.. వైజాగ్ తో నాకు స్పెషల్ అనుబంధం ఉంది
ఇక చాలా గ్యాప్ తరువాత అమీషా .. ఈ మధ్యనే గదర్ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా రికార్డ్ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత అమీషా పేరు మరోసారి గట్టిగా వినిపించడం మొదలయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. జీ5 నిర్వహించిన ఒక ఈవెంట్ కు వెళ్ళింది. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ లో హొయలు పోతూ ఫోటోలకు పోజుచ్చింది. ఇక వయస్సు మీద పడడమో, మేకప్ సెట్ కాకపోవడమో తెలియదు కానీ, అమీషా అసలు అమీషాలానే కనిపించలేదు. సడెన్ గా ఆమెను చూసిన వారెవ్వరు.. అమీషా అని గుర్తుపట్టరు అని చెప్పొచ్చు. ముఖమంతా పాలిపోయి.. మునుపటి కళ లేకుండా కనిపించింది. ఇక అమీషాను చూసిన తెలుగు అభిమానులు పవన్ హీరోయిన్.. మరి ఇంత ఘోరంగా తయారయ్యిందేంటి ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ముదురు భామ ముందు ముందు ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.