Leading News Portal in Telugu

Mallika Rajput: బ్రేకింగ్.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్ కమ్ నటి


Mallika Rajput: బ్రేకింగ్.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్ కమ్ నటి

Mallika Rajput: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రముఖ సింగర్ కమ్ నటి విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్(35) మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబం మొత్తం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆమె మరణించింది అనేది స్పష్టంగా తెలియరాలేదని సమాచారం.


ఇక కూతురు మరణం గురించి తల్లి సుమిత్రా మాట్లాడుతూ.. ” ఈ సంఘటన జరిగినప్పుడు నాకు తెలియదు..నేను నా గదిలో పడుకున్నాను. చాలాసేపటి వరకు గదిలో లైట్ వెలుగుతుండడంతో అనుమానం వచ్చి తలుపు కొట్టాను. ఎంతకు డోర్ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూస్తే.. నా కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్తను, పక్కింటివారిని పిలిచి డోర్ బద్దలుకొట్టి.. మల్లికను ఆసుపత్రికి తరలించాం. అప్పటికే ఆమె చనిపోయింది” అని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మల్లిక గురించి చెప్పాలంటే.. ఆమె సింగర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇంకోపక్క నటిగా కూడా కొనసాగుతోంది. బాలీవుడ్ లో సైతం మల్లిక మంచి హిట్ సాంగ్స్ ను పాడి మెప్పించింది. 35 ఏళ్లకే మల్లికా తనువు చాలించడం బాధాకరమని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య.. ఎవరైనా కావాలని చేశారా.. ? ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.