Leading News Portal in Telugu

Sonia Agarwal : ఆయన సినిమాలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు..


Sonia Agarwal : ఆయన సినిమాలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు..

హీరోయిన్ సోనియా అగర్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో వచ్చిన 7/జీ బృందావన్‌ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది.ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌నే పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్‌ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్‌గా మారిన సోనియా అగర్వాల్‌.. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన కాదల్‌ కొండైన్‌ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘నేను’ అనే టైటిల్‌తో రీమేక్‌ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 7జీ బృందావన్‌ కాలనీ మరియు పుదుపెట్టై (ధూల్‌పేట ) వంటి చిత్రాలు తెరకెక్కాయి.


తాజాగా తన కెరీర్ లో క్లాసిక్ మూవీ గా నిలిచిన 7జీ బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. గతంలో ధనుష్‌ హీరోగా వచ్చిన పుదుపెట్టై సినిమాలో స్నేహ, సోనియా అగర్వాల్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధూల్‌పేట టైటిల్‌తో తెలుగులో డబ్బింగ్ అయింది..తాజాగా పుదుపెట్టై చిత్రానికి కూడా సీక్వెల్‌ చేస్తానని సెల్వరాఘవన్‌ రీసెంట్‌గా అనౌన్స్‌ చేశాడు.పుదుపెట్టే-2 మూవీని ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో ఆ మూవీ సీక్వెల్ లో నటిస్తారా.. అనే దానిపై సోనియా అగర్వాల్‌కు తాజాగా ఓ ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు స్పందించిన సోనియా అగర్వాల్‌.. తన మాజీ భర్త సెల్వరాఘవన్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్య లేదని ఆమె స్పష్టం చేసింది. యాక్టింగ్‌ తన వృత్తి అని, పుదుపెట్టే-2లో నటించడం తనకు ఇష్టమేనని ఆమె తెలిపింది. అయితే ఆ చిత్రం గురించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె పేర్కొంది. అసలు ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంలోనూ తనకు క్లారిటీ లేదని తెలిపింది..