
UI The Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు చూసి వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ, అసలు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే ఉపేంద్రనే. అప్పట్లో ఒక రా, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. వీడు వాడికంటే ఘోరం అని అనుకోక మానరు. అలా ఉండేవి సినిమాలు. ఇక హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు తీసిన ఉపేంద్ర.. మరో యూనిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే UI ది మూవీ. ఈ సినిమాకు ఉపేంద్రనే దర్శకత్వం వహిస్తుండగా.. లహరి ఫిల్మ్స్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్స్ పై జి మనోహరన్ – శ్రీకాంత్ కెపి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. నిజంగా ఈ సాంగ్ పదాలు వింటే.. వింటేజ్ ఉపేంద్ర గుర్తురాక మానడు. నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది .. చీప్ .. చీప్ అంటూ బూతు పదాలతో ఈ సాంగ్ మొదలయ్యింది. దానికి తగ్గట్టుగా ఉపేంద్ర డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు రాంబాబు గోసాల లిరిక్స్ అందించాడు. త్వరలోనే ఫుల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఒక్క సాంగ్ తో సినిమాపై హైప్ తీసుకొచ్చాడు ఉపేంద్ర. మరి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.