Leading News Portal in Telugu

Footage: అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు


Footage: అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు

Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మంజు నటిస్తున్న తాజా చిత్రం పుటేజ్. కుంబళంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్ 5.25 మరియు అంజామ్ పతిరా వంటి ప్రశంసలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ సైజు శ్రీధరన్‌కి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో విశాక్ నాయర్, గాయత్రీ అశోక్ జంటగా నటిస్తున్నారు.


ఇక నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. అందులో విశాక్ ఒడిలో కూర్చొని అతడిని గట్టిగా అదిమిపట్టుకున్న హీరోయిన్ ను చూపించారు. అయితే ఆ హీరోయిన్ మంజు వారియర్ అంటూ కొంతమంది ట్రెండ్ చేశారు. ఇక అంతేకాకుండా సడెన్ గా చూస్తే .. ఈ పోస్టర్ లో ఆ హీరోయిన్ డ్రెస్ వేసుకోనట్లు కనిపిస్తుంది. దీంతో మంజునా ఇంత హాట్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నది మంజు కాదు.. గాయత్రీ అశోక్. ఆమె కూడా మలయాళ నటినే. స్కిన్ కలర్ టైట్ టాప్ వేసుకోవడంతో ఆమె న్యూడ్ గా నటించిందని అనుకున్నారు. దగ్గరగా చూస్తే.. టాప్ కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మంజు అభిమానులు మాత్రం.. అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు అంటూ తమదైన స్టైల్లో చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.