
Varsha Bollamma: సోషల్ మీడియాలో మునిగితేలిపోయేవాళ్లు మాట్లాడుకొనే భాష వేరుగా ఉంటుంది. అదే మీమ్ భాష. ఒక సినిమాలో వచ్చే డైలాగ్ ను.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని.. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టు మాట్లాడకుండా ఈ ఒక్క మీమ్ చెప్తే చాలు. అంతే ఖతమ్.. అర్థమైనవాడు ఓకే అనుకుంటాడు. అర్ధం కానీ వాడు గురించి చెప్పాలంటే.. ఇంకాఎదగాలి భయ్యా అనేస్తారు. ప్రస్తుతం ఉన్న కుర్రకారు అంతా ఇలా మీమ్ భాషలోనే మాట్లాడుకుంటున్నారు. కేవలం కుర్రకారు మాత్రమే కాదు సెలబ్రిటిలు సైతం ఈ మీమ్ భాషను ఫాలో అవుతున్నారు. కుర్ర హీరోలు.. ఎప్పుడైనా ఫ్యాన్స్ తో సరదాగా కౌంటర్లు వేసినప్పుడు, అంతెందుకు.. ఈ మధ్య సుమ తన ఇంటర్వ్యూలో మీమ్ సెగ్మెంట్ అని పెట్టేసింది . సోషల్ మీడియా లో వారి సినిమా గురించి కానీ, ఆ హీరో గురించి కానీ వచ్చిన మీమ్స్ చూపిస్తూ.. ఆ హీరోలు ఏమనుకుంటున్నారో అడిగేస్తుంది. అసలు ఈ మీమ్స్ గురించి ఇప్పుడెందుకు టాపిక్ వచ్చింది అంటే .. ఒక కుర్ర హీరోయిన్.. ఒక మీడియా రిపోర్టర్ చేసిన అతి చూసి మీమ్ డైలాగ్ చెప్పి షాక్ ఇచ్చింది.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఊరి పేరు భైరవకోన. ఫిబ్రవరి 16 అనగా రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీమియర్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో మీడియా రిపోర్టర్స్ అందరూ హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన అన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఒక రిపోర్టర్.. కావ్యకు ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. అయితే సినిమా గురించి కాకుండా కొద్దిగా కావ్య బ్లష్ అయ్యేలా మాట్లాడం మొదలుపెట్టాడు. అందరూ ఒకలాంటి డ్రెస్ వేసుకొచ్చారు.. మీరు బ్లూ చీరలో వచ్చారు. సెంట్రాఫ్ ఎంట్రాక్షన్ అంటూ మాట్లాడుతున్నాడు. ఇక ఇదంతా పక్కన వింటున్న వర్ష నవ్వుతూ మైక్ తీసుకొని.. ” నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ చూసాను.. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావ్ రా” అంటూ అనేసింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వేశారు. ఇక ఇది చూసిన నెటిజన్స్.. అదేంటి మావా.. పుసుక్కున అంత పెద్ద మాట అనేసింది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావ్రా..! – Varsha Bollamma#VarshaBollamma #KavyaThapar #SundeepKishan #OoruPeruBhairavakona #VIAnand #NTVENT #NTVTelugu pic.twitter.com/TOmg5DZ3o0
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) February 15, 2024