
Kurchi Madathapetti Dialouge from Chandrababu goes viral: కుర్చీ మడతపెట్టి అనే ఒక డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ కావడంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఏకంగా ఒక పాట చేసేసారు. ఇప్పుడు అదే పదంతో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన విద్వాంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆయన పుస్తకంలో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పారని అన్నారు. ఇది విధ్వంసం పుస్తకం కాదు… ఇది ఒక జర్నలిస్టు ధర్మాగ్రహం, దేశ చరిత్రలో తొలిసారి పాలన పై పుస్తకం రావడం ఇదేనని అన్నారు. చాలా మంది చేయలేని పని సురేష్ కుమార్ చేశారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది, ప్రజల ఆకాంక్షలు విధ్వంసం అయ్యాయని పేర్కొన్న ఆయన విధ్వంసం గురించి రాసిన పుస్తకం అమరావతి రైతు మహిళలకు అంకితం చేయడం గర్వించదగినదన్నారు.
Pallavi Prashanth: అప్పుడే చచ్చిపోవాలనిపించింది… అరెస్టుపై పెదవి విప్పిన పల్లవి ప్రశాంత్
ఐదేళ్ళలో మూడు రాజధానులు… ఇప్పుడు నాలుగో రాజధాని అని అన్నారు. నేనుండే అద్దె ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నించారని పేర్కొన్న ఆయన రాముడు మాదిరిగా రాజకీయాలకు విరామం ఇచ్చిన వ్యక్తి గల్లా జయదేవ్ అని అన్నారు. ఇక నేను, పవన్ కళ్యాణ్ కలిసి ధృఢ సంకల్పంతో పని చేస్తామని, అసెంబ్లీని కౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తరువాతే అడుగు పెడతా అన్నానని, ఆ రోజు జరిగిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నానన్నారు. ఇక పవన్ కి హెలికాఫ్టర్ కు పర్మిషన్ ఇవ్వలేదు.. నేను పర్చూరులో మీటింగ్ పెట్టకూడదని అన్నారు, మేం మీటింగ్ కూడా పెట్టుకోలేని పరిస్ధితిలో ఉన్నామని బాబు పేర్కొన్నారు. తెలుగుజాతి లో పేదరికం లేకుండా చేయడం కోసం నేను, పవన్ పనిచేస్తామన్న ఆయన 54 రోజుల్లో మా బాధ్యత మేం నెరవేరుస్తామన్నారు. చొక్క మడత పెడతాడట… మీరు చొక్కాలు మడతపెడితే… మా టిడిపి, జనసైనికులు కుర్చీలు మడత బెడతారని ఆయన కామెంట్ చేశారు.