
ఓటీటీలలో ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభిస్తుంది. క్రైమ్ కామెడీ జోనర్ వెబ్ సిరీస్ లను తెగ ఇష్టపడుతున్నారు. ఆ జోనర్ లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ క్రైమ్ కామెడీ జోనర్లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే ‘సన్‌ఫ్లవర్’…ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఒక సీజన్ ను పూర్తి చేసుకోగా.. ఫస్ట్ సీజన్ కి మంచి ఆదరణ లభించడంతో మేకర్స్ రెండో సీజన్ ని కూడా ప్లాన్ చేశారు. జీ5 ఒరిజినల్ గా తెరకెక్కిన ‘సన్‌ఫ్లవర్ 2’ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇక సీజన్ 2లో అదా శర్మ కూడా సునీల్ గ్రోవర్ టీమ్ తో కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.‘సన్‌ఫ్లవర్’ అనే అపార్ట్మెంట్స్ లో హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేశారో తెలుసుకునే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ దిగేంద్ర పాత్రలో రణవీర్ షోరే నటించారు.
ఇక ఇందులో హీరోగా సునీల్ గ్రోవర్.. సోనూ సింగ్ అనే పాత్రలో కనిపించారు. వీరితో పాటు గిరీష్ కులకర్ణి, ముకుల్ చడ్డా, రాధా భట్ మరియు ఆశిష్ విద్యార్థి కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 1లో అదా శర్మ నటించ లేదు. అయితే సీజన్ 2లో ’సన్‌ఫ్లవర్’ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా వచ్చిన రోజీ మెహతా పాత్రలో అదా కనిపించనుంది. అదా శర్మ పాత్ర ఈ వెబ్ సిరీస్ కి గ్లామర్ ని యాడ్ చేయనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అదా శర్మ చాలా బోల్డ్గా కనిపిస్తోంది. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు..అనేది సీజన్ 2లో తేలుతుందో లేదో చూడాలి. ‘సన్‌ఫ్లవర్’సీజన్ 1 తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 2 2024 మార్చ్ 1న సబ్ స్క్రైబర్ ల ముందుకు రానుందని జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ‘‘సన్‌ఫ్లవర్’సొసైటీలో మరో మర్డర్ జరిగింది. ఇందులో కూడా సోనూనే ప్రధాన అనుమానితుడిగా నిలిచాడు. బిల్డింగ్లో కొత్తగా కొందరు అనుమానితులు చేరారు. వీరందరిలో ఎవరు రియల్ కిల్లర్? సన్ఫ్లవర్ 2లో ఈ డార్క్ కామెడీని చూడండి’ అంటూ ‘సన్ఫ్లవర్ 2’ ట్రైలర్ ని జీ5 సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.