Leading News Portal in Telugu

Priyamani : షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటమ్ సాంగ్ చేశాను..



Whatsapp Image 2024 02 16 At 10.28.25 Pm

నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా తర్వాత అలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయాల్సిందిగా తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా తాను తిరస్కరించానని, కేవలం షారుక్ కోసమే ఆ పాట చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.

చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో 1234 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అనే పాటలో ప్రియమణి.. షారుక్ ఖాన్ తో చిందులేసింది. “షారుక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ద్వేషించే వాళ్లు ఉండొచ్చు. కానీ అతన్ని ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను కలిసిన మంచి మనసున్న వాళ్లలో షారుక్ ఖాన్ ఒకరు. ఆయన మహిళలతోనే కాదు అందరితోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటారు.. ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలో నేను ఆయన నుంచే నేర్చుకున్నాను” అని ప్రియమణి చెప్పింది.”షారుక్ తో చెన్నై ఎక్స్‌ప్రెస్ రోజుల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా డ్యాన్స్ ఎక్కడో చూసి రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ తమను కలవడానికి రమ్మని పిలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని ప్రియమణి తెలిపింది. ఆ తర్వాత కూడా గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో నటించింది.