
Allari Naresh 61 Film Titled Aa Okkati Adakku: గతంలో పెళ్లి సమస్య మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, దాదాపుగా అలా వచ్చినవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంకం మల్లి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమాని రాజేష్ చిలక నిర్మిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భరత లక్ష్మీపతి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
Devara Part 1: వాయిదా పడ్డ దేవర, ఎన్టీఆర్ కీలక ప్రకటన.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ఇప్పుడు అదే పేరుతో అల్లరి నరేష్ హీరోగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడమే కాదు ఫస్ట్ లుక్ తో పాటు ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ గ్లింప్స్ ని పరిశీలిస్తే అల్లరి నరేష్ గణ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇంట్లోంచి ఆఫీస్ కి వెళ్లడానికి బయట అడుగుపెట్టిన వెంటనే చుట్టుపక్కల ఉండేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పెళ్ళెప్పుడు అని అడుగుతూ ఉండడంతో ఫ్రెష్టేట్ అవుతూ ఉంటాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదని పాన్ ఇండియా ప్రాబ్లం మీద సినిమా అని అల్లరి నరేష్ చేత పలికించిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, అరియనా గ్లోరీ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతో జామీ లివర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అబ్బూరి రవి కథ అందించారు. సూర్య సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్న ఈ సినిమాని మార్చి 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.