
Nara Lokesh Kurchi Madathapetti in Vizianagaram Sabha: మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బాగా వైరల్ అయిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా తిరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అనే డైలాగు వాడగా నిన్నటికి నిన్న చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక నారా లోకేష్ కూడా నేనేం తక్కువ తిన్నానా? అన్నట్టు డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు ఏకంగా కుర్చీని మడత పెట్టి పెద్ద సభలో లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన విజయనగరం జిల్లా నెలిమర్లలో జరిగిన శంఖారావం సభలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్
పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే వైఎస్సార్‌సీపీ నేతల్ని ఊరుకునేది లేదన్న లోకేష్ మీరు చొక్కాలు మడతపెడితే.. మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని కౌంటరిచ్చారు. అక్కడితో ఆగకుండా ఎలా చేస్తామో చూపిస్తా అని ఆ సభలోనే ఓ కుర్చీని మడతపెట్టి లైవ్ లో చూపించారు. ఇక ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూవు ఉత్తరాంధ్ర ప్రాంతం అమ్మలాంటిదని.. ఈ ప్రాంత ప్రజలకు కష్టపడటం తప్ప మాయా మర్మం తెలియవన్నారు. ఇక ఈ ఐదేళ్లలో మూడు రాజధానులన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. మూడు ముక్కలాట ఆడుతున్న వైఎస్సార్‌సీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్న ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మచ్చ తేవాలనుకున్నారని.. ప్రపంచం అంతా చంద్రబాబు అభిమానులు ఎంత మంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు.
"నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం" నెల్లిమర్లలో, కుర్చీ మడత పెట్టి, జగన్ కి వార్నింగ్ ఇచ్చిన లోకేష్.. #Shankharavam#NaraLokesh#BabuSuper6 #AndhraPradesh pic.twitter.com/JwbFTMEur0
— Telugu Desam Party (@JaiTDP) February 16, 2024