Leading News Portal in Telugu

Web Series: ఆ సిరీస్‍ ఆపండంటూ కేసేసిన సీబీఐ.. నెట్‍ఫ్లిక్స్‌కి నోటీసులు



Netflix

Cbi Moves Mumbai Court To Stop Indrani Mukerjea Netflix Docu-Series Show: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్‌ ది బరీడ్ ట్రూత్ సిరీస్ ను నిషేధించాలని డిమాండ్‌ చేసింది. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ‘ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్’ వెబ్ సిరీస్ రూపొందించి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍ చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సిరీస్‍ను ఆపాలని సీబీఐ.. కోర్టుకు వెళ్లింది. విచారణ ముగిసే వరకు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌పై స్టే విధించేలా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ సిజె నాండోడ్ ద్వారా తన దరఖాస్తులో సీబీఐ కోర్టుకు తెలిపింది.

Shraddha Das: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌లైన్ కంపెనీపై తీవ్రస్థాయిలో ఫైరయిన శ్రద్ధాదాస్

ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్పీ నాయక్-నింబాల్కర్ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఇతరులకు దరఖాస్తుపై స్పందించాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. డాక్యుమెంట్-సిరీస్ ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ సిరీస్ షీనా బోరా హత్య గురించి మరింత తెలుసుకునేలా డిజైన్ చేశారు. షీనా ముఖర్జీ ఇంద్రాణి కుమార్తె, 2012లో ఆమె హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అయితే ఈ కేసు ఇంకా తేలలేదు. “నిందితులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారు కూడా ఉన్న ఈ సిరీస్‍ను స్ట్రీమ్ కాకుండా ఆపేయాలని విచారణ ముగిసే వరకు ఏ ప్లాట్‍ఫామ్‍లో కూడా ప్రసారం కాకుండా ఆపాలని కోరింది. మరి కోర్టు 20వ తేదీన ఏమి తేల్చనుందో చూడాలి.