
Dhanush 50 Rayan First Look : ధనుష్ కొత్త చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌కి 50వ సినిమా కానున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. గత డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ధనుష్ గతంలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘రేయాన్’ టైటిల్ తో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి కనిపిస్తోంది. ఇక అతని వెనుక, సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి. సినిమాలో హింసకు లోటు ఉండదని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ఇక ఈ కాంబినేషన్ కొత్తగా ఉండడం ఫ్యాన్స్ కి ట్రీట్ ఖాయం అని అంటున్నారు.
Anchor Suma: సుమ ఆధ్వర్యంలో నేత్ర శిబిరం.. ఫ్రీగా ఆపరేషన్లు!
ఇక దాదాపు 3 మంది వ్యక్తులు కసాయి దుకాణంలో పనిచేస్తున్నట్లు లేదా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక గతంలో ‘పవర్ పాండి’ సినిమాని డైరెక్ట్ చేసిన ధనుష్ ఈసారి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సారి అతను యాక్షన్‌లోకి దిగినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ పెట్టారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్. పీటర్ హైన్ ఈ చిత్రానికి పోరాట సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. తొలి సినిమానే ఫీల్ గుడ్ సినిమాగా తెరకెక్కించిన ధనుష్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ కథను హ్యాండిల్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి గోబం’ చిత్రానికి కూడా ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి టీనేజ్ డ్రామాగా ఉండబోతోంది.
RAAYAN #D50 @sunpictures @arrahman pic.twitter.com/DdDNlJPVxw
— Dhanush (@dhanushkraja) February 19, 2024