
Free Eye Camp for TV and Cine Workers by Anchor Suma: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉచిత ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ కాంప్ కి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి ఉచిత కంటి చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల మాట్లాడుతూ – ఇవాళ ఈ ఐ క్యాంప్ లో పాల్గొనేందుకు వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నా,. ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేము స్థాపించిన ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థతో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర్ నేత్రాలయ వారితో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది.
Dil Raju: తమ్ముడి కొడుకు సంగీత్.. హలమితి హబీబో స్టెప్పులేసిన దిల్ రాజు
తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ తమ సహకారం అందిస్తున్నారు. జుబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కూడా తమ వంతు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఐ క్యాంప్ ను సినీ, టీవీ అసోసియేషన్ లోని సభ్యులంతా వినియోగించుకోవాలని కోరుతున్నానని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా, ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. నానక్ రామ్ గూడలో ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్స్ ఆపించాం, అక్కడ సినిమా ఇండస్ట్రీ తరుపున పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి తరుపున, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.