
బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనుంది.. ఈ విషయాన్ని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘డాన్ యూనివర్స్‌లోకి స్వాగతం కియారా అద్వానీ’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. ఇక కియారా తొలిసారిగా రణ్‌వీర్ సింగ్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయనున్నది.ఫర్హాన్ అక్తర్ డాన్-3 చిత్రాన్ని గతేడాది ప్రకటించారు. డాన్ ఫ్రాంచైజీలోని తొలి రెండు చిత్రాల్లో షారుఖ్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. డాన్-3లో సరికొత్త రణ్‌వీర్ సింగ్ కనిపిస్తాడని ప్రకటించారు..
ఇక డాన్-3 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అదే సమయంలో చిత్రంలోని మిగతా పాత్రలకు సైతం నటీనటుల ఎంపిక కూడా కొనసాగుతుందని తెలుస్తున్నది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే, చిత్రబృందం దీనిపై స్పందించలేదు. త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. కియారా అద్వానీ 2023లో విడుదలయిన సత్యప్రేమ్ కి కథ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది., ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.. అలాగే, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 చిత్రంలో కూడా కియారా హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా డాన్ 3 లో ఆఫర్ అందుకుంది.ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని కియారా అద్వానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాగా ప్రేక్షకులు తమ ప్రేమ, మద్దతు అందిస్తారని ఆమె ఆశించారు.
Welcome to the Don universe @advani_kiara #Don3@RanveerOfficial @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies @chouhanmanoj82 #Olly pic.twitter.com/T5xGupgHiF
— Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2024