
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉంటుంది..
అయితే ఈ అమ్మడు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. తెలుగులో టాప్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఇప్పుడు ఇక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది.. ఇక ముంబైలో కొత్త ఇల్లు కొన్నట్లు తెలుస్తుంది.. ముంబైలోని అంథేరి ఏరియాలో ఖరీదైన ఇల్లు సొంతం చేసుకుందట అమ్మడు. అయితే ఈ ఫ్లాట్ కంగనా రనౌత్ తండ్రి బ్రదర్ దని తెలుస్తుంది.. ఈ ఇంటి విలువ 4 నుంచి 5 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.. హైదరాబాద్ లో కూడా కొత్త ఇంటిని కొనే ఆలోచనలో ఉందని తెలుస్తుంది..
ఇది ఇలా ఉండగా.. రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. హీరో శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే శింబు హీరోగా స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న మూవీలోనూ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సీత బాగా బిజీ అయ్యింది..