
Tillu Square OTT Rights Bagged By Netflix for Rs 35 Crores: కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్స్ తో పని లేదని గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు సినిమాతో హిట్ కొట్టిన సిద్దూ టాలెంట్ వలన టిల్లు స్క్వేర్ దశే మారిపోయింది. అందుకే టైర్ 2 హీరోల రేంజ్ లో బిజినెస్ జరిగిపోతోంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో మేకర్స్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. బిజినెస్ ట్రెండ్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాన్ థియేట్రికల్ రైట్స్ కే 35 కోట్ల మేర అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సిద్ధు జొన్నలగడ్డకు అంత మార్కెట్ లేదు. కానీ టిల్లు బ్రాండ్ కు క్రేజ్ ఉంది. అందుకే బయ్యర్ల ఆ రేంజ్ లో ఆఫర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Rakul Preet Singh Wedding Pics: రకుల్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. ఎలా మెరిసిపోతున్నారో చూశారా?
టైర్ 2 హీరోల రేంజ్ కి ఈక్వల్ గా సిద్ధు సినిమా బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ ఉండటం ప్లస్ అయింది . మూడు నిమిషాల ట్రైలర్ లోనే అన్ని శాంపుల్స్ చూపిస్తే ఇక ఫుల్ మూవీలో ఇంకెంత అరాచకం ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. స్ట్ పార్ట్ ని ఆహాకు ఇస్తే ఇప్పుడు సీక్వెల్ ని మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి మొదటి వారం నుంచి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వారం రోజుల గ్యాప్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఉండటంతో టిల్లు స్క్వేర్ కి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. మార్చిలో ఆపరేషన్ వాలెంటైన్, గామి, భీమా, ఆ ఒక్కటి అడక్కు లాంటి సినిమాలు వస్తున్నా యూత్ ఛాయిస్ టిల్లు స్క్వేర్ అనడంలో సందేహం లేదు. మరి భారీ హైప్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.