
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మాహారాజ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే రవితేజ కూడా స్టార్ హీరోలను ఫాలో అవుతున్నాడు.. దాదాపు అందరు హీరోలు కూడా ఒక్క సినిమాలను మాత్రమే కాదు.. మరోవైపు బిజినెస్ లను కూడా చేస్తున్నారు.. రవి తేజ కూడా కొత్త బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. అదే విధంగా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఏఎంబి సినిమాస్ ప్రస్తుతం అద్భుతంగా రన్ అవుతోంది.. అలాగే అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు.. అది కూడా బాగానే నడుస్తుంది.. ఇక ఇప్పుడు రవితేజ కూడా అదే దారిలో నడుస్తున్నారు..
ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరికీ పోటీగా రవితేజ మల్టీఫ్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు రవితేజ నటిస్తున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ షుక్ నగర్ లో భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. 6 స్క్రీన్స్ ఉన్న మల్టీ ఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారట. ఈ మల్టీ ఫ్లెక్స్ కి ART ఏఆర్టి అని నామకరణం కూడా చేబోతున్నట్లు సమాచారం.. ఇక ఇటీవల ఈ హీరోకు సరైన హిట్ సినిమా పడలేదు.. రీసెంట్ గా వచ్చిన ఈగల్ సినిమా కూడా నిరాశపరిచింది..