Leading News Portal in Telugu

Shaitaan : ఆకట్టుకుంటున్న అజయ్ దేవగన్ ‘సైతాన్ ‘ ట్రైలర్..



Saitaan

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాజాగా సైతాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను లాంచ్ చేశారు.. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్‌ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్‌ (అజయ్‌) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్‌) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్‌ దేవగన్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ..

ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. కొన్ని సస్పెన్స్ సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.. మాధవన్‌ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్‌ సమర్పణలో అజయ్ దేవగన్‌, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన ‘వష్’ మూవీకు ఇది రిమేక్ గా రాబోతుంది..