Leading News Portal in Telugu

Mamitha Baiju: పిల్ల అంటే ఇలా ఉండాల్రా చారి.. ప్రేమలు భామకు తెలుగులో ఫుల్ డిమాండ్!



Mamitha Baijy

Full Demand for Mamitha Baiju in Telugu: సినిమా ఒక భాషలో హిట్ అయితే దాన్ని రీమేక్ చేయడానికి క్యూ కడతారు మేకర్స్. అలాగే ఒక భాషలో సక్సెస్ అయిన హీరోయిన్‌ ని కూడా తమ ఇండస్ట్రీకి తీసుకువెళ్లడానికి ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్ నే షురూ చేసింది ఓ మలయాళ బ్యూటీ. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఆమె ఇంకెవరో కాదు మమితా బైజు. మలయాళ మూవీ ‘ప్రేమలు’తో హిట్ కొట్టింది ఈ బ్యూటీ. హైదరాబాద్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కేరళలో బ్లాక్ బస్టర్ అయింది. విడుదలై రెండు వారాలు గడిచిన హౌస్ ఫుల్స్ తో నడుస్తుంది. ఈ సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇందులో మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Chaari 111: ‘చారి 111’కి సీక్వెల్… రుద్రనేత్ర యూనివర్స్‌లోకి స్టార్ హీరోలు!

ఆమె అందానికి యూత్ ఫిదా అవుతున్నారు. దీంతో ఎలాగైనా ఈ బ్యూటీని టాలీవుడ్‌కు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కెరీర్ బిగినింగ్ నుంచి మల్లూవుడ్ సినిమాలకే పరిమితమైన మమితా జైజు ఫస్ట్ టైం జీవీ ప్రకాష్ సరసన ‘రెబెల్’ అనే తమిళ్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఈ కేరళ కుట్టితో ఇద్దరు తెలుగు దర్శకులు చర్చలు జరుపుతున్నారట. ఆ ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఓకే అయినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి మల్లూవుడ్ బ్యూటీస్ ని ఆదరించిన టాలీవుడ్ మమిత బైజుకి కూడా గ్రాండ్ వెల్ కమ్ చెబుతోంది. మరి తెలుగులో ఈ బ్యూటీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.