Leading News Portal in Telugu

Priyamani: ఖరీదైన కారు కొన్న ప్రియమణి..ధర ఎంతో తెలుసా?



Priyani

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతుంది. థియేటర్లలో, ఓటీటీలలో వరుస లు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతేడాది జవాన్ తో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల భామా కలాపం 2 వెబ్ సిరీస్‏తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ భామ కీలకపాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ విజయవంతంగా దూసుకుపోతుంది..

మరోవైపు బుల్లితెరపై కనిపిస్తుంది.. పలు షోలకు జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఒకవైపు సినిమాలు, మరొకవైపు యాడ్స్ లలో కనిపిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.. ఆ కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ కారు ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు.. జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది ప్రియమణి. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రూ. 74 లక్షల వరకు ఉంటుంది.ఆమె దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి.. ఇప్పుడు మరో కారు ఆమె షెడ్ లోకి చేరింది..

పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో భామా కలాపం సిరీస్ భారీ సక్సెస్ ను అందుకుంది.. దాంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar)