Leading News Portal in Telugu

Madhu Bala: రోజా సినిమా.. మణిరత్నంకు క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి.. ఏం చేశాడు.. ?



Roja

Madhu Bala: నా చెలి రోజావే అన్నా.. పరువం వానగా నేడు కురిసిందిలే అన్నా.. కళ్ళముందు ఒకే ఒక్క రూపం కదలాడుతూ ఉంటుంది. ఆమె రోజా.. అదేనండీ మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీలో కూడా అదరగొడుతుంది. మధుబాల పూర్తి పేరు.. మధూ షా. 1991 లో ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది. తమిళ్, హిందీ, మలయాళ సినిమాల్లో నటించింది. అయినా ఆమెకు పేరు దక్కలేదు. 1992 లో మధుబాల.. మణిరత్నం కంట్లో పడింది. రోజాగా మధుబాల మారిపోయింది. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మణిరత్నం హీరోయిన్స్ ఎలా ఉంటారో అందరికీ తెల్సిందే. ఆయన కెరీర్ లో రీపీట్ చేయని హీరోయిన్ లిస్ట్ లో మధుబాల ముందు ఉంటుంది. అందుకు కారణం ఆమె అహంకారం. ఈ విషయం ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రోజా సమయంలో ట్యాంకు ఆటిట్యూడ్ ఉందని, ఆ ఆటిట్యూడ్ ను మణిరత్నం ముందు చూపించడంతో తనను మరో సినిమాలో తీసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.

” రోజా సినిమా నాకు చాలా మంచి హిట్ ఇచ్చింది. అయితే ఆ క్రెడిట్ మొత్తం మణిరత్నం తీసుకోవడం నాకు నచ్చలేదు. ఆయనకెందుకు క్రెడిట్ ఇవ్వాలి. నాలో ఆయన రోజాను చూసుకున్నాడు. అంతకుమించి ఏం చేశాడు. ఇదే నేను ఆ సినిమా హిట్ తరువాత అనుకున్నది. అయితే ఇలాంటి అహంకారం రావడానికి కారణం నా బాధ. ఇండస్ట్రీకి నేను ఒక్కదాన్నే వచ్చాను. అన్ని నేనే చుకొనేదాన్ని.. మేకప్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిదీ నాకు నేను చేసుకున్నదే. ఎవరు నాకు సపోర్ట్ గా నిలిచినవారు లేరు. అందుకే నా సక్సెస్ లో ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనుకోలేదు. కానీ, ఇప్పుడు చెప్తున్నాను.. రోజాకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది మణిరత్నం కే చెందుతుంది. ఆయన లేకపోతే రోజా లేదు. ఆ సినిమా తరువాత ఆయనతో టచ్ లో ఉండాలని చూసాను. కానీ, నా ఆటిట్యూడ్ వలన దగ్గర కాలేకపోయాను. అందుకే ఇప్పటివరకు ఆయన నాకు రెండో అవకాశం ఇవ్వలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.